telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భారత సైట్లపై చైనా దాడులు!

hacking system

గాల్వాన్ లోయలో ఈ నెల 15న భారత్, చైనా మధ్య ఘర్షణల తరువాత చైనా హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఈ రెండు వారాల వ్యవధిలో భారత వెబ్ సైట్లపై జరుగుతున్న దాడులు 300 శాతం వరకూ పెరిగాయని సింగపూర్ కు చెందిన సైబర్ రీసెర్చ్ పేర్కొంది. చైనా హ్యాకర్ల దాడులు భారీ స్థాయిలో పెరిగాయని సంస్థ సీఎండీ రితేశ్ కుమార్ తెలిపారు. చైనా హ్యాకర్లంతా తొలుత వెబ్ సైట్లపై దృష్టిని పెడుతున్నారని ఆయన అన్నారు. కీలక సమాచారం సేకరించి, టార్గెట్ ను ఎంచుకుంటున్నారని తెలిపారు. తరువాత దాడులకు దిగుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

గత నెల 18వ తేదీకి ముందు రియల్ ఎస్టేట్, మీడియా, ప్రభుత్వ రంగ ఏజన్సీలు, స్మార్ట్ ఫోన్లు తదితర వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు, ఆ తరువాత పేట్రేగిపోయారని చెప్పారు. సంస్థల పరువు తీయడం, మేధో హక్కులను దొంగిలించడం, , వినియోగదారుల వివరాలు సేకరించడం వంటి పనులు చేస్తున్నారని ఆయన అన్నారు.

గతంలో పాకిస్థాన్, ఉత్తర కొరియాలకు చెందిన హ్యాకర్ల ద్వారా దాడులు జరిపించిన చైనా హ్యాకర్లు, ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగారని రితేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. చైనా రాజధాని బీజింగ్ తో పాటు గ్వాంగ్ ఝో, షెన్ జన్, చెంగ్డూ తదితర నగరాల నుంచి ఈ దాడులు జరుగుతున్నట్టు తమ రీసెర్చ్ లో తేలిందన్నారు.

Related posts