గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం చైనాపై ఒత్తిడి పెంచేందుకు దేశవ్యాప్తంగా అనేక సంస్థలు సిద్దమయ్యాయి. ఈ క్రమంలో దేశంలోని చైనా పౌరులకు ట్యాక్సీ సేవలు అందించబోమని టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తమ ట్యాక్సీలలో చైనా పౌరులను ఎక్కించుకునే ప్రసక్తే లేదని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కమల్ చిబ్బర్ పేర్కొన్నారు.
తమ అసోసియేషన్‌లో 500 మందికిపైగా ట్యాక్సీ ఆపరేటర్లు, ట్రావెల్ యజమానులు భాగస్వాములుగా ఉన్నారని ఆయన తెలిపారు. చైనీయులకు సేవలు అందించకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. అంతేకాదు, వారి వాహనాలపై ఇందుకు సంబంధించిన నోటీసులను కూడా అతికిస్తున్నారు. ఢిల్లీ హోటల్ అసోసియేషన్ ఇప్పటికే చైనీయులకు సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.