telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వీడియో వైరల్ : భారీ వరదలో చిక్కుకుపోయిన వ్యక్తి… కాపాడిన ఐఏఎఫ్

IAF

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తోన్న కుండపోత వర్షాలకు చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ సమీపంలో ఖుతాఘాట్‌ ప్రాంతంలో భారీ వరదలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. వరదలో తనను తాను రక్షించుకోవటానికి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని అలాగే ఉండిపోయాడు. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు అక్కడే ఉన్నాడు. దీంతో విమానంతో అక్కడకు చేరుకున్న వైమానిక దళ సిబ్బంది తాడును కిందకు వదిలి అతడి ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Related posts