telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

హీరో ఆఫర్ : పాత పెట్రోల్ వాహనం ఇచ్చేయండి.. కొత్త విద్యుత్ వాహనంపై ..

heromotocorp offer on electric bikes

హీరోమోటో కార్ప్‌, విద్యుత్తు వాహనాల విక్రయానికి వినూత్న ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మీ పాత పెట్రోల్‌ ద్విచక్ర వాహనాన్ని ఇచ్చి ఎలక్ట్రిక్‌ బైక్‌ను కొనుగోలు చేస్తే రూ.6,000 లబ్ధి కల్పిస్తామని పేర్కొంది. పాత పెట్రోల్‌ వాహనానికి మార్కెట్‌ విలువ కంటే రూ.6,000 అదనంగా చెల్లిస్తామని పేర్కొంది. ఆ వాహనం విక్రయానికి పనికిరానిదై, జీవితకాల చరమాంకంలో ఉన్నా ఈ ఆఫర్‌ వర్తింపజేస్తామని పేర్కొంది. బీఎస్‌4 వాహనంతో పోలిస్తే ఇవి దాదాపు రెండింతల కాలుష్యాన్ని సృష్టిస్తాయని పేర్కొంది. దేశంలో కాలుష్య కారకమైన 5కోట్ల వాహనాలు ఉన్నాయని కంపెనీ అంచనా వేసింది.

హీరో ఎలక్ట్రిక్‌ వాహనం, పెట్రోల్‌ వాహనంతో పోలిస్తే ఖర్చులను చాలా తగ్గిస్తుందని ఆ సంస్థ చెబుతోంది. ఈ వాహనాల బ్యాటరీపై 3ఏళ్ల వారెంటీని హీరో ఆఫర్‌ చేస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగదారుడికి మిగులు రూపంలో మారిస్తే రూ.70వేలకు సమానమని పేర్కొంది. విద్యుత్తు వాహనాల అభివృద్ధి విభాగం సీఈవో సోహిందర్‌ సింగ్‌ గిల్‌ మాట్లాడుతూ ”భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని తెలిపారు. దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. హీరో దీనికి మద్దతు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తోంది” అని ఆయన అన్నారు.

Related posts