telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మంత్రుల ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీ…

Nimmagadda ramesh

ప్రివిలేజ్ కమిటీ భేటీ ముగిసింది. అయితే ఇవాళ సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ.. ఎస్ఈసీపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని.. విచారణ చేపట్టింది.. మంత్రుల ఫిర్యాదులోని అంశాలను చర్చించారు ప్రివిలేజ్ కమిటీ సభ్యులు… ఈ భేటీలో ఎస్ఈసీకి నోటీసులివ్వాలని పలువురు సభ్యులు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. అయితే, భేటీలో ఎస్ఈసీపై వచ్చిన ఫిర్యాదులపై మరింత లోతుగా చర్చించాలని ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన వర్చువల్ గా ఈ భేటీ జరిగింది.. ఎన్నికల కమిషనర్ పై ఇచ్చిన ఫిర్యాదు ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి వస్తుందని నిర్ధారణకు వచ్చిన కమిటీ.. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలాంటి విచారణ జరిగిందనే దానిపై కూడా చర్చించింది. ఈ ఫిర్యాదును విచారించాలని.. విచారణలో భాగంగా తదుపరి చర్యలపై చర్చించాలని నిర్ణయానికి వచ్చింది కమిటీ. దీంతో… మళ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎప్పుడు సమావేశం కానుంది.. ఎలాంటి చర్యలు తీసుకోనుంది అనేది ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సమయంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఫిర్యాదు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Related posts