నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు రేపటి ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మే 28న స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి. ఈ సందర్భంగా నందమూరి ఫ్యామిలీ అంతా ప్రతి ఏడాది ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్ళి నివాళులు అర్పిస్తారు. కరోనా వలన ఈ సారి దీనిని రద్దు చేసుకున్నారు. తమ అభిమాన హీరోలు ఆ ప్రాంతానికి వస్తున్నారని తెలిసిన అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌కి భారీగా చేరుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో తాము ఇంటి వద్ద ఉండి తాతయ్యకి అశ్రు నివాళులు అర్పిస్తే బాగుంటుందని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కరోనా ఎఫెక్ట్‌తో అనేక కార్యక్రమాలు రద్దు అవుతున్న సంగతి తెలిసిందే. జనావాసాలలోకి ఎక్కువగా వెళ్లొద్దని నిబంధన ఉన్న నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా చాలా కార్యక్రమాలని రద్దు చేసుకుంటున్నారు.
ప్రియాంక హెయిర్ స్టైల్ ఫై వర్మ స్పందన