telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరెంట్‌, వాటర్‌ బిల్లులు మాఫీ చేయాలి: వీహెచ్‌ డిమాండ్

hanmanth rao congress

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు విమర్శలు గుప్పించారు. లాక్‌డౌన్‌ అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. లాక్‌డౌన్ సడలింపులతో కరోనా కేసులు పెరుగుతాయని తెలిపారు.

తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా చేస్తున్నారని, తక్కువ టెస్టులు చేస్తున్నారని హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. కరెంట్‌, వాటర్‌ బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలని వీహెచ్‌ డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థ బాగా పనిచేస్తోందని, ప్రతిపక్షంగా బలంగా లేనప్పుడు న్యాయవ్యవస్థే దిక్కని చెప్పారు. తిరుపతి వెంకన్న భూములు అమ్మొద్దని, ఎవరూ కొనొద్దని వీహెచ్‌ హితవుపలికారు.

Related posts