telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చాణక్య ట్రైలర్… చావుకు భయపడనొడు బుల్లెట్ కు భయపడతాడా ?

Chanakya

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం “చాణక్య‌”. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్ల‌ర్ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లు మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుని సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇండియన్ రా ఏజెంట్ పాకిస్తాన్ వెళ్లి అక్కడేం చేసాడు అనేది అసలు కథ. లడక్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తీవ్రంగా గాయపడ్డాడు గోపీ. పంతం తర్వాత మరోసారి ఇందులో మెహ్రీన్‌తో రొమాన్స్ చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts