telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సోలో బ్రతుకే సో బెటర్ ట్రైలర్ విడుదల…

ప్రస్తుతం థియేటర్లు ఇటీవల తెరుచుకుంటున్నాయి. కానీ థియేటర్లలో సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు వెనకడుగువేస్తున్నారు. ఓటీటీకి అలవాటు పడిన వారు మళ్లీ థియేటర్లకు వచ్చి సినిమాలను చూసేందుకు మొగ్గు చూపుతారా అన్నా ప్రశ్న వారికి ఎదురైంది. దానికితోడుగా కేవలం యాభైశాతం మాత్రమే ప్రేక్షకులు ఉండాలన్న నిబంధన కారణంగా వారికి నష్టం వస్తుందన్న భయం పెనుభూతంలా మారింది. అప్పటికీ హాలీవుడ్ సినిమా టినెట్, రామ్ గోపాల్ వర్మ సినిమా కరోనా వైరస్‌లు విడుదలయ్యాయి. అవి కేవలం నామమాత్రపు విడుదలల మారి నిర్మాతల భయాన్ని మరింత పెంచాయి. దాంతో ఇప్పుడు సినిమాలను విడుదల చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదు. ఈ టైంలో కాస్త క్రేజ్ ఉన్న సినిమా బొమ్మపడితే అభిమానులు ఇళ్లనుంచి బయటకు వస్తారని, థియేటర్ల బాట పడతారని భావించారు. ప్రస్తుతం  క్రేజ్ ఉన్న సినిమా అంటే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పడంతో ఈ క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. దీంతో ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. సినిమాలో విరాట్ అనే కుర్రాడి పాత్రలో తేజ్ కనిపిస్తాడు. ఆర్ నారాయణమూర్తిని ఆదర్శంగా తీసుకొని పెళ్లి అనేది వేస్ట్, దాని వల్ల లాభం లేదంటూ దానిపై స్పీచ్‌లు ఇస్తూ ఉంటాడు. అలాంటి వాడి జీవితంలోకి హీరోయిన్ వస్తుంది. దాంతో హీరో లైఫ్ ఎలా టర్నయిందనేదే సినిమా కథ. దానికి తోడు ట్రైలర్ చివరిలో విరాట్  ఆర్ నారాయణ మూర్తి ఇంటర్య్వూ చూస్తుంటాడు. అందులో నారాయణమూర్తి ‘ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి. పెళ్లి చేసుకోవాలి’ అంటారు. దీంతో ట్రైలర్ ఎండ్ అవుతుంది.

Related posts