కళ్యాణ్ రామ్ నటుడిగా, నిర్మాతగా రెండు రంగాల్లో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘118’ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మార్చి 1న విడుదలైన ఈ చిత్రం డిసెంట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు సినిమాపై మంచి టాక్ వచ్చాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమా కథ, స్క్రీన్ ప్లేతో పాటు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండటంతో మంచి టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.10.45 కోట్లు వసూలు చేసింది.
ఏరియాల వారీగా క్లోజింగ్ కలెక్షన్స్ :
1. నైజాం – రూ. 4.00 కోట్లు
2. సీడెడ్ – రూ.1.25 కోట్లు
3. యూఏ – రూ.1.20 కోట్లు
4. గుంటూరు – రూ.0.70 కోట్లు
5. ఈస్ట్ గోదావరి – రూ.0.62 కోట్లు
6. వెస్ట్ గోదావరి – రూ.0.48 కోట్లు
7. కృష్ణ – రూ.0.80 కోట్లు
8. నెల్లూరు – రూ.0.25 కోట్లు
9. ఆంధ్ర, తెలంగాణ – రూ.9.30 కోట్లు
10. ఇతర ప్రాంతాలు – రూ.0.75 కోట్లు
11. ఓవర్సీస్ – రూ.0.40 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్ – రూ. 10.45 కోట్లు