జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడుతూ, ఏపీలో కేవలం రెండు కుటుంబాలు మాత్రమే రాజకీయాలు చేయాలా? సామాన్యులకు రాజకీయం అవసరం లేదా? అని ప్రశ్నించారు. శాసనసభ గడప కూడా తొక్కని నాయకుడు మనకు అవసరమా? అని అడిగారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు, జగన్ లను సైతం మన పార్టీకే ఓటు వేయాలని అడుగుతున్నానని చెప్పారు.
వైసీపీ అంటే టీడీపీకి భయమని… వైసీపీని ఎదుర్కోవడానికి జనసేనే కరెక్ట్ పార్టీ అని అన్నారు. సైకిల్ పాతబడిపోయిందని… ఫ్యాన్ తిరగాలంటే పవర్ మనం ఇవ్వాలని ఎద్దేవా చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే బహిరంగంగానే పెట్టుకుంటానని చెప్పారు. జగన్ మాదిరి దొడ్డిదారిన వెళ్లి ప్రధాని మోదీ కాళ్ళు పట్టుకున్నట్టుగా, తాను పట్టుకోనని అన్నారు.
కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: గుత్తా