telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఖిలాడిలో ద్విపాత్రాభినయం చేయనున్న రవితేజ…

Raviteja

రవితేజ ఈ ఏడాది సంక్రాంతి కనుక విడుదలైన క్రాక్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తన విజయాత్ర కొనసాగిస్తుందడగానే రవితేజ తన తదుపరి చిత్రం నుంచి సరికొత్త అప్‌డేట్ తీసుకొచ్చాడు. రవితేజ నూతనంగా చేస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన పోస్టర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రలు చేయనున్నారంట. తండ్రికొడుకుల పాత్రల్లో రవితేజ కనిపించనున్నారంట. అయితే ఈ సినిమా రమేష్ వర్మ దర్వకత్వంలో తెరకెక్కతోంది. ఇందులో మాస్ మహరాజ్ సరసన మీనాక్షి చౌదరీ , డింపుల్ హయాతి నటిస్తున్నారు. దీనిని రమేష్ వర్మ యాక్షన్ ఎంటర్‌టైర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతోంది. ఇందులో రవితేజ లుక్స్ ఎలా ఉంటాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల వచ్చిన రవితేజ క్రాక్ సినిమా బారీ హిట్ కావడంతో రవితేజ తదుపరి చిత్రం ఖాలాడీ పై కూడా అంచనాలు తారాస్థాయిని మించిపోయాయి. మరి ఈ సినిమాతో మరోసారి రవితేజ అభమానులను ఆకట్టుకుంటుందేమో వేచి చూడాలి.

Related posts