యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్స. రాదాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్ ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్.
ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రభాస్, పూజా హెగ్డేలతో పాటు దర్శక నిర్మాతలు ఈ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వరుసగా ఇంటర్వూలు ఇస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’పై పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా వారితో పంచుకుంటున్నారు.
తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డేతో రొమాన్స్ సీన్స్‌పై ప్రభాస్ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు. పూజాతో ప్రభాస్ లిప్ లాక్ కూడా ఉందని తెలిపారు. తనకు ముందు నుంచి ముద్దు సీన్స్ అంటే చాలా సిగ్గు అని.. కానీ రాధేశ్యామ్ కథ డిమాండ్ మేరకు చేయక తప్పలేదన్నారు.
ఈ సినిమాకు రొమాంటిక్ సన్నివేశాలే ఇంపార్టెంట్. అందుకే, ఆ సన్నివేశాలు చేయాలన్నప్పుడు సెట్ లో ఎవరు లేకుండా ఒక ప్రైవేట్ స్పేస్ లో చేస్తానని చెప్పాను. అందుకు దర్శకుడు ఓకే చెప్పగానే ఓ రహస్య ప్రదేశంలో ముద్దు సీన్స్ కానిచ్చేశాను.
అంతేకాదు కొన్ని సీన్స్‌లో షర్టు లేకుండా చేసినప్పుడు కూడా ఓ ప్రైవేట్ ప్లేస్‌లోనే షుటింగ్ పూర్తి చేశాను’.. అని తెలిపారు ప్రభాస్.