నయనతార దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసే అద్భుత నటి. ఆమె ఇది వరకు చేసిన ప్రతి సినిమాలో నయనతార నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.శ్రీరామరాజ్యంలో సీత పాత్రలో ఆమె నటనకు ముగ్ధులైపోయారు. సింహ సినిమాలో ఆమె నటనకు జేజేలు కొట్టాల్సిందే. వాస్తవానికి ఏదైనా సినిమాలో నయనతార ఉందంటే.. కచ్చితంగా ఆమె హైలైట్ అవుతుంది. ఒకానొక సందర్భంలో హీరోను సైతం డామినేట్ చేసే సత్తా ఆమెది. నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. స్టార్ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. ఇప్పట్లో ఆమె స్థాయిని అందుకునేవారే లేరని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఆమె సినిమాల్లో హీరో నామమాత్రమే. అసలైన హీరో ఆమె. ఆమె పేరుతోనే కోట్లు వచ్చి పడుతుంటాయి. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఇటు తెలుగు, అటు తమిళంలో బిజీగా ఉన్న ఆర్టిస్టులలో ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరో సినిమాలలో నటిస్తూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. దర్భార్ చిత్రంలో రజనీ సరసన కథానాయికగా నటిస్తున్న నయన్.. విజయ్, అజిత్ చిత్రాలలో కథానాయికగా ఎంపికైంది. అయితే సినిమా ప్రమోషన్లకీ, అందుకు సంబంధించిన ఇంటర్వ్యూలకి నయనతార ఆమడ దూరంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. వీటికే కాకుండా సోషల్ మీడియాకు చెందిన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ వంటి వాటికి కూడా నయనతార దూరంగా ఉండడమే ఆమె అభిమానులను ఆవేదనకు గురి చేస్తోందట. మిగతా హీరోయిన్లకు సంబంధించిన విశేషాలు, వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తాయనీ, తమ అభిమాన హీరోయిన్ గురించిన సమాచారం తెలుసుకోవాలంటే కొద్దిగా కష్టపడాల్సిందేనన్నది వారివాదన.
previous post
“మన్మథుడు-2” వసూళ్ళపై నాగార్జున స్పందన