telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శ్రీదేవి సోడా సెంటర్ లో ప్రభాస్…

ప్రస్తుతం హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’తో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఆన్ లొకేషన్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ పోస్టర్ లో తెలుగు స్టార్ హీరోస్ తో సినిమాలో రాజా ఫోటోస్టూడియో యజమాని సూరిబాబు  పాత్ర పోషిస్తున్న సుధీర్ బాబు ఫోటో చూస్తే షాక్ తినాల్సిందే. అందులో చిరంజీవి, రజనీకాంత్, పవన్ కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్ల మధ్య సుధీర్ ఉన్న రాజా ఫోటోస్టూడియో కనిపిస్తోంది. సూరిబాబు విత్ సూపర్ స్టార్స్ స్మైలింగ్ ఫేస్ విత్ సన్ గ్లాసెస్.. 70ఎంఎం ఎస్.ఎస్.సి అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ప్రచారం మొదలెట్టారు. అయితే ఈ స్టాండింగ్ ఫోటోల్లో ప్రభాస్, బన్ని మిస్ కావటమే హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఇదే విషయమై రచ్చ మొదలైంది.ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఫోటోను షేర్ చేసింది చిత్రబృందం. అందులో కేవలం ప్రభాస్ ఫోటో తో సుధీర్ బాబు ఉన్నాడు. అయితే అప్పటి ఈ పోస్టర్ లో ప్రభాస్ మిస్ కావటం అభిమానులను కొంత వరకూ హర్ట్ చేసిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రభాస్ కు ప్రత్యేకంగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం.

Related posts