telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

వరద బాధితులకు బాలయ్య విరాళం…

Balakrishna

తాజాగా నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. హైదరాబాద్ వరద బాధితులకు ఆయన అండగా నిలిచారు. అయితే ఎడతెరపి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా కొంతమంది నిరాశ్రయులు అయ్యారు. అయితే హైదరాబాద్ వరద బాధితులకు నందమూరి బాలకృష్ణ ఒక కోటి 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఇటీవల జరిగిన రోడ్డు పక్కనున్న నివాసాలు పూర్తిగా వర్షపు నీరుతో కొట్టుకుపోయిన వారికి అండగా నిలిచారు నందమూరి బాలకృష్ణ. అదేవిధంగా పాతబస్తీలో బసవతారక రామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబలాకు బిర్యానీ ఏర్పాటు చేసి వారికి పంపించారు. ఈరోజు సాయంత్రం వారికి అవి ఇవ్వనున్నారు. ఇక కరీనా లాక్ డౌన్ సమయం లో కూడా ఈ హిందూపురం ఎమ్మెల్యే ముందుకు వచ్చి తన వంతు సహాయం అందించారు. రూ.1.25 కోట్ల విరాళం అందించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధులకు కోటి రూపాయలు, సినీ కార్మికుల కోసం రూ. 25 లక్షలు ఇచ్చారు బాలయ్య.

Related posts