telugu navyamedia
సినిమా వార్తలు

సెప్టెంబర్‌లోనే ‘సైమా’ వేడుక.. ముందంజలో మహర్షి

2019 ఏడాదికి సంబంధించిన సైమా అవార్డుల ప్రదానోత్సవాలను ఈ ఏడాది నిర్వహించనున్నట్లు సైమా ఛైర్‌పర్సన్ ప్రకటన విడుదల చేశారు. దక్షిణాదిన ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల కార్యక్రమాన్ని కరోనా కారణంగా మూడేళ్లుగా నిర్వహించడం లేదు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈసారి నామినేట్ అయిన చిత్రాలు ఇండస్ట్రీలకు ఓ బెంచ్ మార్క్‌ను నిర్దేశించాయన్నారు. హైదరాబాద్‌లో వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.

అత్యంత ఆదరణ పొందిన చిత్రాలుగా నామినేషన్‌లో ముందంజలో నిలిచిన చిత్రాలు: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు పూజా హెగ్డే జంటగా నటించిన ‘మహర్షి’ చిత్రం పది నామినేషన్లతో ముందంజలో ఉంది. 9 నామినేషన్లతో ‘మజిలీ’ చిత్రం రెండో స్థానంలో ఉండగా 7 నామినేషన్లతో ‘జెర్సీ’ చిత్రం మూడో స్థానంలో ఉంది.

మహేష్ నటించిన మహర్షి సినిమాకు ఇప్పటికే పలు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా మహర్షి సినిమాకు నేషనల్ అవార్డు దక్కింది. అలాగే సినిమాలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా కూడా రాజు సుందరం జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. అంతేకాకుండా సైమా వేడుకల్లో కూడా మహర్షి సినిమా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఉంది.

ఇక తమిళంలో ధనుష్‌ హీరోగా నటించిన ‘అసురన్‌’ చిత్రం 10 నామినేషన్లతో ముందంజలో ఉంది. కార్తీ నటించిన ఖైదీ చిత్రం 8 నామినేషన్లతో రెండో స్థానంలో ఉంది.

మలయాళంలో ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘కుంబళంగి నైట్స్‌’ నుంచి అత్యధికంగా 13 నామినేషన్లు దాఖలు కాగా, కన్నడ చిత్రం ‘యజమాన’ నుంచి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. విజేతలను ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా నిర్ణయించనున్నారు. అభిమానులుwww.siima.in వెబ్‌సైట్‌తో పాటు SIIMA ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తమ అభిమాన చిత్రానికి ఓట్లు వేయవచ్చు.

అత్యంత ఆదరణ పొందిన చిత్రాలుగా నామినేషన్‌లో ముందంజలో నిలిచిన చిత్రాలు: మహర్షి(తెలుగు), అసురన్‌(తమిళం), యజమాన(కన్నడ), కుంబళంగి నైట్స్(మలయాళం)

Related posts