telugu navyamedia
సినిమా వార్తలు

వెంకటేష్ చేతుల మీదుగా “త్రీమంకీస్‌” టీజర్ విడుదల

3-Monkeys

సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘త్రీమంకీస్‌’. అనిల్‌కుమార్‌ దర్శకుడు. కారుణ్యచౌదరి కథానాయిక. ఓరుగల్లు సినీ క్రియేషన్స్‌ పతాకంపై నగేష్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర లోగో, ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ నాగబాబు చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా హీరో వెంకటేష్ చేతులు మీదుగా ప్రారంభించారు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్లో సుధీర్, శ్రీను, రాంప్రసాద్ కామెడీ సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, కారుణ్య చౌదరి ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts