telugu navyamedia
సినిమా వార్తలు

తారక్‌ ఆంబీషియస్‌, చరణ్‌ సెక్యూర్డ్..

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటించిన సినిమా ఆర్‌. ఆర్ .ఆర్‌.“రౌద్రం రణం రుధిరం ”. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెర‌కెక్కుతున్న సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అలియా భట్, యంగ్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా..అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.

 

ఈ క్ర‌మంలో సోమవారం సాయంత్రం చెన్నైలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.. ఈ సంద‌ర్భంగా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ..తారక్‌కి, చరణ్‌కి ఓ పొజీషియన్‌కి కోరిక ఉంది. కానీ ఇద్దరి దారులు వేరు. తారక్‌ ఆంబీషియస్‌, చరణ్‌ సెక్యూర్డ్. ఈ ఇద్దరు బోల్ట్ లు, ఇద్దరు అపోజిట్‌, ఒకరు నార్త్ అయితే, మరొకరు సౌత్‌, వారిద్దరు ఓ మ్యాగ్నెట్‌లా వచ్చి `ఆర్ఆర్‌ఆర్‌`కి అతుక్కుపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

SS Rajamouli Speech RRR Chennai Event – actp news telugu

ముందుగా ఎన్టీఆర్‌ గురించి చెబుతూ..నా కంటే తానే సినీయ‌ర్ అని తార‌క్ తనతో ఎప్పుడూ దెబ్బలాడుతుంటాడని..అందుక‌నే తార‌క్ గురించి మాట్లాడ‌తానంటూ.. చైల్డ్ మెంట‌లిటీ..లైన్ ప‌ర్స‌నాలిటీ..నిజంగా తార‌క్ ప్రేమ‌ను త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం..సునామిలా వ‌చ్చి ప‌డిపోతాడు అంటూ ..త‌న ఎన‌ర్జీ…తార‌క్‌తో నాకు చాలా గొడవలు ఉంటాయి. వీళ్లతో రెండేళ్లు పని చేశాక నేను ఎన్టీఆర్‌ని చరణ్ అని, చరణ్‌ని తారక్ అనే వాడ్ని.’

అంతేకాదు.. ఎన్టీఆర్‌కు అస్సలు టైమ్ సెన్స్ లేదు. ఏడు గంటలకు షూటింగ్ అయితే ఆరు గంటలకే సెట్‌కు వస్తాడు అని… నా మనసులో ఏముందో తారక్ తెలుసుకుని నేను చెప్పకముందే అలా చేస్తాడు. పాత్ర కోసం ఎంత ఎనర్జీ పెడతాడో మాటల్లో చెప్పలేం. ఆయనకు ఇలా రండి, ఇలా చేయండని చెప్పాల్సిన అవసరం లేదు.నేను షాట్‌ పెడితే చాలు నా ఊహలోని విజువల్‌కు తగ్గట్లుగా నటిస్తాడు.ఎన్టీఆర్‌ నటుడిగా ఉండటం, అది తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు ఇండియన్‌ సినిమా చేసుకున్న అదృష్టం’ అని చెప్పుకొచ్చారు.

Ram Charan And Jr NTR

అలాగే..మూడేళ్లపాటు ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటే ఉండిపోయినందుకు తారక్‌కి ధన్యవాదాలు తెలిపారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`నే కలగంటూ, ఈ సినిమానే తింటూ ఊపిరిగా పీల్చుకుంటూ ఉన్న తారక్‌కి ధన్యవాదాలు తెలిపారు రాజమౌళి.

ఇక రామ్‌ చరణ్‌ గురించి మాట్లాడుతూ.. ‘చరణ్‌ నా హీరో. ..తాను పని గురించి ఎంతో ఆలోచించి సెట్స్‌కు వస్తుంటానని, కానీ చరణ్‌ క్లియర్‌ మైండ్‌తో వచ్చి ‘నా నుంచి మీకు ఏం కావాలి?’ అని అడుగుతారని.. చరణ్ దగ్గర నేను ఇలాంటి చాలా విషయాలు నేర్చుకున్నాను.. తన గురించి తాను ఇంత సెక్యూర్‌గా ఫీలైన నటుడిని నేనిప్పటి వరకు చూడలేదని చెప్పారు రాజమౌళి. అంత అద్భుతంగా యాక్ట్‌ చేస్తారని చెప్పుకొచ్చారు.

Related posts