telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘బస్టాండే..బస్టాండే నీ బతుకు బస్టాండే’… అంటూ నితిన్ కు ‘రంగ్ దే’ టీం పెళ్లి గిఫ్ట్

Rangde

యంగ్ హీరో నితిన్ కు ‘రంగ్ దే ‘టీం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. నితిన్ పెళ్లి సందర్భంగా వన్ మినిట్ వీడియోతో కూడిన ప్రోమోను యూట్యూబ్లో విడుదల చేసింది. ఈ వీడియో ఆద్యంతం ఎంతో ఫన్ తో సాగింది. సినిమాలో కీర్తి సురేష్ కు తాళి కట్టే సమయంలో ‘నాన్న తను నవ్వుతోంది.. నేను కట్టలేను అనడం, పెళ్లయ్యాక నితిన్ ఇంటి పని, వంట పని చేస్తుండగా బ్యాక్ గ్రౌండ్ లో ‘బస్టాండే బస్టాండే నీ బతుకు బస్టాండే ‘ అని సాగే లిరిక్ సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆకట్టుకునేలా ఉంది. ఈ టీజర్‌పై నితిన్ స్పందిస్తూ ‘ఈరోజు మరింత స్పెషల్‌గా చేసినందుకు రంగ్‌దే టీమ్‌కు థ్యాంక్స్‌’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ చిత్రంలో నితిన్‌ సరసన కీర్తీ సురేశ్‌ నటిస్తుండగా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ రంగ్ దే తో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా, అంధాదూన్ రీమేక్, కృష్ణ చైతన్యతో పవర్ పేట అనే ఓ భారీ సినిమాలు చేయనున్నాడు. కాగా, నితిన్-శాలినిల పెళ్లి ఇవాళ రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్ లోని ఫలక్నుమా ప్యాలెస్ లో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరుగనుంది. ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేయగా దానికి కూడా మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ టీజర్ కు 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి. 

Related posts