telugu navyamedia
సినిమా వార్తలు

హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్.. మాలధారణ ఎన్ని రోజులంటే..

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హనుమాన్ దీక్ష చేపట్టాడు.. 21 రోజులపాటు ఎన్టీఆర్‌ ఈ దీక్షలో ఉండబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ హనుమాన్ దీక్షని చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.

కాషాయ దుస్తులు..మెడలో హనుమాన్ మాల, నుదిటిన కుంకుమతో ఎన్టీఆర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినీ కెరీర్‌లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ ఈ దీక్షని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

మొదటిసారి ఈ వస్త్రధారణలో ఎన్టీఆర్‌ని చూసిన నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం దీక్షలో ఎన్టీఆర్ కనిపిస్తున్న ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇటీవల రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీని కంప్లీట్ చేసిన తారక్..త్వ‌ర‌లో కొరటాల శివ దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది.ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. 

గతంలో కొరటాల- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘జ‌న‌తా గ్యారేజ్’ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించడంతో ఈ ప్రాజెక్టుపై జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related posts