‘మాస్ట్రో’ యూత్ స్టార్ నితిన్ కు … మిల్కీ బ్యూటీ తుపాకి గురిపెట్టింది. నిన్నటి వరకూ క్యూట్ గా తన అందంతో కవ్వించిన అందాల బ్యూటీ ఇప్పుడు విలన్ అవతారమెత్తింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ నితిన్, తమన్నా కాంబినేషన్‌లో ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ పోస్టర్‌లో నల్ల కళ్లద్దాలతో భయపడుతూ నిల్చున్న నితిన్, అతని పక్కనే గన్ పట్టుకుని నిలబడ్డ తమన్నా హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఈ మూవీలో తమన్నా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషిస్తోందని సమాచారం. ‘మాస్ట్రో` విడుదలకు సిద్ధంగా ఉంది. ‘మాస్ట్రో’. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలవుతుంది.
నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా.. నితిన్ హీరో గా 30వ చిత్రం కావడం విశేషం. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.