telugu navyamedia
సినిమా వార్తలు

జాతీయ జెండాను చ‌ర‌ణ్‌ అవమానించాడా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అశోక చక్రం లేని జాతీయ జెండా పట్టుకొని అడ్డంగా బుక్కయ్యారు. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ…ఆయనపై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ.. వారికి నివాళులర్పిస్తూ భారతీయులందరూ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. సెలబ్రిటీలంతా సోషల్ మీడియా ద్వారా ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పారు.

అయితే చరణ్ తప్పు ఏం లేకపోయినా చరణ్ గురించి నెగిటివ్ గా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం జాతీయ జెండాను అవమానించారంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. హ్యాపీ మెుబైల్స్ అనే సంస్థకు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. స్వాత్యంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సదరు సంస్థ పేపర్ ప్రకటన ఇచ్చింది. అందులో రామ్ చరణ్ జాతీయ జెండా పట్టుకున్న‌ట్లు ఉంది. అయితే ఆ జాతీయ జెండా మ‌ధ్య‌లో అశోక చక్రం లేకపోవడం అందరి కంట పడింది.

దీంతో ఒక వైపు సినిమాల‌తో బీజీగా ఉంటూ మ‌రో వైపు యాడ్స్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే అశోక చక్రం లేని జాతీయ జెండా పట్టుకొని అడ్డంగా బుక్క‌య్యారు. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ…విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

కాగా..ప్రస్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌తంలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటిస్తూ బీజీగా ఉన్నారు.

Related posts