telugu navyamedia
సినిమా వార్తలు

ఆది పినిశెట్టి స్పోర్ట్స్ డ్రామా… ఫస్ట్ లుక్ విడుదల

Clap

తమిళ హీరో ఆది పినిశెట్టి తాజాగా ఓ స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. నూత‌న ద‌ర్శ‌కుడు పృథ్వి ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్రానికి క్లాప్ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో క్లాప్ బోర్డ్‌తో పాటు గ్రౌండ్‌ని కూడా చూపించారు . ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయ‌న్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా, ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఆకాంక్ష సింగ్ క‌థానాయికగా న‌టిస్తుంది. క్రిష కురుప్ కీల‌క పాత్ర పోషిస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగ‌గంగా జ‌రుపుకుంటుంది. స్పోర్ట్స్ జోన‌ర్ చిత్రంలో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రం అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్‌గా మారే క్ర‌మంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూపించ‌నున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

Related posts