telugu navyamedia
క్రీడలు

తాలిబన్ల ప్ర‌భావం ఆఫ్గనిస్థాన్‌ క్రికెట్ పై ప‌డ‌నుందా ?

తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను.. చివ‌ర‌కు అధ్య‌క్ష భ‌వ‌నాన్ని సైతం ఆక్రమించుకుని తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు . అక్క‌డ పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ప్ర‌జ‌లు మాత్రం భ‌యంతో వ‌ణికిపోతున్నారు.. కాబూల్‌లో ప్ర‌ధాన ర‌హ‌దారులు.. వాహ‌నాల‌తో భారీ ట్రాఫిక్‌తో ద‌ర్శ‌న‌మిస్తుండ‌గా.. ఇక‌, ఎయిర్‌పోర్ట్ లో ప్ర‌జ‌ల ర‌ద్దీ పెరిగిపోయింది.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకెళ్లారు.. విమానంలో ఎక్కితే చాలు అనే అతృత వారిలో క‌నిపిస్తోంది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆప్ఘనిస్థాన్‌ నుంచి కాబూల్ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు.

Afghanistan cricket team

ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే ఆప్ఘనిస్థాన్‌లో క్రికెట్‌తో పాటు అన్ని ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం పెరిగి అంతర్జాతీయ వేదికలపైనా అంతో ఇంతో సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లిన తరుణంలో ఇకపై ఆ దేశ క్రికెట్ భవిష్యత్ ఎలా కొనసాగనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆప్ఘనిస్థాన్‌లో క్రికెట్‌తో పాటు అన్ని ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం పెరిగి అంతర్జాతీయ వేదికలపైనా అంతో ఇంతో సత్తా చాటుకుంటున్నారు.

Afghanistan Taliban crisis: What will happen to Afghanistan cricket team? |  Cricket News | Zee News

ఈ నేప‌థ్యంలో ఆప్ఘనిస్తాన్ క్రికెట్ భవిష్యత్‌పై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. దుబాయ్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కి తమ జట్టు అన్ని విధాల సిద్ధం అవుతున్నట్టు ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టంచేసింది. ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజర్ హిక్మత్ హాసన్ ప్రముఖ న్యూస్ ఛాన‌ల్‌తో మాట్లాడుతూ.. టి20 వరల్డ్ కప్‌లో పాల్గొనడంపై ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్‌కి సన్నద్ధం అవడం కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లతో ట్రై సిరీస్‌కి సైతం ప్లాన్ చేస్తున్నట్టు హాసన్ తెలిపారు.

Related posts