telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ స్టార్ హీరో విజయ్ అరుదైన రికార్డుకి బ్రేకులు వేసిన కరోనా…

Master

కరోనా కారణంగా స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే . అయితే తాజాగా కేంద్రం కొత్త మార్గదర్శకాలతో అక్టోబర్ 15 నుంచి ధియేటర్ల రీఓపెన్ కు అనుమతి ఇచ్చింది. ధియేటర్లు రీఓపెన్ అయినప్పటికీ సినిమాలను ధియేటర్లలలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు, హీరోలు వెనుకాడుతున్నారు. అందులో భాగంగానే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం “మాస్టర్” సినిమా అన్ని కార్యక్రమాలనూ సిద్దం చేసుకొని విడుదలకి సిద్దం అయింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. అయితే కరోనా వలన ఈ సినిమా విడుదల ఉంటుందా లేదా అని అభిమానులలో సందేహం నెలకొంది. సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తారని తమిళ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ప్రేక్షకులకు చిత్ర నిర్మాతలు షాక్ ఇచ్చారు. సినిమాని ఈ ఏడాది రిలీజ్ చేయడం లేదని వెల్లడించారు. దీనితో విజయ్ పేరు పైన ఉన్న ఓ అరుదైన రికార్డుకి బ్రేక్ పడినట్టు అయింది. సినిమాల్లోకి విజయ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సంవత్సరానికి ఒక్క సినిమా అయిన విడుదల చేస్తూ వచ్చారు. ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఒక్క ఏడాది కూడా ఆయన జీరో ఇయర్‌గా విడిచిపెట్టలేదు. తాజాగా కరోనా పుణ్యామా అని అ అరుదైన రికార్డుకి బ్రేక్ పడినట్టు అయింది.

Related posts