telugu navyamedia
ఆరోగ్యం

ఇంగువతో రోగ నిరోధక శక్తి…

inguva

ఇంగువ (Asafoetida) వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం, చాలా ఔషధ గుణాలున్న మొక్క. ఇంగువలో కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరటిన్, బి-విటమిన్ వంటి పదార్థాలు వున్నాయి. ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసన కలిగి ఉంటుంది. వంటలలో వేసి ఉడికినప్పుడు ఒక విధమైన మసాలాదినుసుల వాసననిస్తుంది. ఇంగువ మొక్క శాస్త్రీయ నామం ‘ఫెరులా అసఫోటిడా’. దీనిని సంస్కృతంలో “హింగు” అంటారు. భారత దేశంలో దీని వాడకం ఏనాటినుంచో ఉంది. కడుపుని శుభ్రం చేసే సాధనాలలో ఇది చాలా ముఖ్యమైనది. అలాగే ప్రేవుల్లో వచ్చే నొప్పిని కూడా అది తగ్గిస్తుంది. నరాల బలానికి దీనిని వాడుతారు. మంచి జీర్ణకారి. నిద్రని పుట్టించే గుణం కూడా దీనిలో ఉంది దీనిని బ్రాంకయిటస్, అస్త్మా లలో వాడుకోవచ్చు. రెండు చెంచాల తేనెను 2,3 సెంటి గ్రాముల ఇంగువ పొడిని, తెల్ల ఉల్లి రసం, తమలపాకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశవ్యాధులు దూరంగా ఉంటాయి. హిస్టీరియాతో బాధపడే వారికి ఇంగువ వాసనని చూపిస్తే ఫలితం బాగుంటుంది. లైంగిక పటుత్వం తగ్గినవారిలో ఇంగువని వాడుకోవచ్చు. మర్రిపాలలో తేనెని కలిపి కొద్ది ఇంగువని కలిపి తీసుకుంటే 40 రోజులలో మంచి గుణం కనిపిస్తుంది. ఐరోపా దేశాల్లో చిన్న పిల్లల మెడలో దీనిని తాయెత్తులా కడితే చాలా రోగాలు దూరంగా ఉంటాయని వారు నమ్ముతారు. బహుసా దీనికి ఉందే తీవ్రమైన వాసన వలన చాలా సూక్ష్మ జీవులు దరిచేరవు. స్త్రీల సమస్యలకి కూడా ఇంగువని మంచి మందుగా వాడుకోవచ్చు. ముఖంగా పీరియడ్స్ లో వచ్చే నొప్పి, అధిక రక్తస్రావం, లుకేరియా, తరచూ ఎబార్షన్స్ కావడం లాంటి అనేక పరిస్థితులలో దీనిని వాడతారు. పై సమస్యలతో సతమతమయ్యేవారు నెలరోజుల పాటు రోజూ మూడు సార్లు ఇంగువని తేనెని మేకపాలతో కలిపి తీసుకుంటే చాల ఉపయుక్తంగా ఉంటుంది ఇలా చేయడం వలన స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పై ఇంగువ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ప్రసవానంతరం వచ్చే జీర్ణ వ్యవస్థకి వచ్చే అనేక సమస్యల్లో కూడా ఇంగువ ఉపకరిస్తుంది. ఇంగువని మన తెలుగు ఇళ్ళల్లో ముఖ్యంగా దీని జీర్ణకారి గుణం గురించి ఎక్కువగా వాడతారు. కడుపులో శబ్దాలు తగ్గాలన్నా, కడుపు ఉబ్బరంగా ఉన్నా, ఇంగువ అత్యంత ఉపయుక్తం. పంటి నొప్పి బాధిస్తుంటే ఇంగువని నిమ్మరసంలో కలిపి ఒక దూదిలో ఉంచి పుప్పి పంటిలో ఉంచితే నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇంగువని నల్లమందుకు విరుగుడుగా కూడా వాడతారు.నల్లమందు యొక్క చెడుగుణాల్ని ఇది తగ్గిస్తుంది.

Related posts