telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ధనుష్ “డి 40”

Dhanush'

‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, ‘గేమ్ ఓవర్’ లాంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో మంచి స్ధానం సంపాదించుకున్న ‘వై నాట్’ స్టూడియోస్ నిర్మాణం‌‌లో పాన్ ఇండియా స్టార్‌గా ఇమేజ్ వున్న‌ ధనుష్ హీరోగా, ‘పిజ్జా’, ‘జిగర్తండా’, ‘పేట’ సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో D 40(ధ‌నుష్‌-40) ని తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత‌ ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు.భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌’, ‘గీత‌ గోవిందం’, ‘టాక్సివాలా’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’ లాంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ని అందించిన నిర్మాణ సంస్థ‌లు జిఏ 2 పిక్చ‌ర్‌, యువీ క్రియేష‌న్స్ ఇప్ప‌డు జిఏ2యువి ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నారు.నిర్మాణ విలువ‌లు, మినిమ‌మ్ గ్యారెంటీ స‌బ్జ‌ెక్ట్స్‌తో అత్య‌ధిక స‌క్స‌ెస్ రేట్‌తో దూసుకుపోతున్న ఈ రెండు సంస్ధ‌లు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌ట‌మే హీరో ధనుష్‌కున్న క్రేజ్‌ని తెలియ‌జేస్తుంది. ఈ చిత్రం యెక్క ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ వివ‌రాలు త్వ‌ర‌లో
తెలియ‌నున్నాయి.

Related posts