telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌బాస్‌ లో రామ్‌చరణ్‌ సందడి

తెలుగు బిగ్‌బాస్-5లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అడుగుపెట్టబోతున్నాడు. హోస్ట్ నాగార్జున వీకెండ్ లో రెండ్రోజుల పాటు సందడి చేయనున్నారు. ఈ వారాంతంలో బిగ్ బాస్ వేదికపై రామ్ చరణ్ విచ్చేయనున్నారు. మ్యాస్ట్రో టీమ్ తో కలిసి చెర్రీ హంగామాను అభిమానులు కనులారా తిలకించవచ్చు.

నితిన్, తమన్నా, నభా నటేష్ నటించిన మ్యాస్ట్రో చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికపై రిలీజైంది.ఈ మూవీ ప్రచారంలో భాగంగా మ్యాస్ట్రో టీమ్ సభ్యులు నితిన్, తమన్నా, నభా నటేష్ లతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ కూడా బిగ్ బాస్ వేదికపై దర్శనమిచ్చారు.

బిగ్ బాస్ ఇంటి సభ్యులతోనూ రామ్ చరణ్ ఈ సందర్భంగా ముచ్చటిస్తాడని తెలుస్తోంది. గతంలో బిగ్ బాస్ 4 సీజన్లు జరిగినా, రామ్ చరణ్ ఎప్పుడూ రాలేదు. తొలిసారి బిగ్ బాస్ వేదికపై రామ్ చరణ్ దర్శనమివ్వనుండడంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు.

Related posts