telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 17 (మంగళవారం) రాశి ఫలాలు

మేషం : ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి అభివృద్ధి కనిపిస్తోంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. సహచరులు, సన్నిహితులతో వాదనలకు దిగవద్దు. డబ్బు విషయంలో జాగ్రత్త.

వృషభం : ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మానసికంగా దృఢంగా ఉంటారు.

మిథునం: ఆదాయానికి డోకా లేదు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా ఫలితముంటుంది. బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. వ్యాపారులు లాభార్జన చేస్తారు.

కర్కాటకం: ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు బాగా కష్టపడాల్సి వస్తుంది. దుష్టులకు దూరంగా ఉండండి

సింహం: ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులకు బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండండి.

కన్య: ఉద్యోగంలో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకులిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లావాదేవీల విషయంలో వ్యాపారులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది.

తుల: సమయం అన్నివిధాలా బాగుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా పురోగతికి అవకాశం ఉంది. స్నేహితులతో పేచీలు రావచ్చు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. అనుకోని పనులు జరుగుతాయి.

వృశ్చికం: ఆదాయానికి కొరత ఉండదు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో కొన్ని శుభ కార్యాలు ఉంటాయి. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఒక చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు.

ధనస్సు: తలచిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. సమయం అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీల్లో ప్రయోజనం పొందుతారు. వ్యాపారులకు శ్రమ ఎక్కువైనా ఫలితం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

మకరం: అనుకోకుండా చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. డబ్బు వ్యవహరంలో జాగ్రత్త వహించండి. భార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు. వ్యాపారులు తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది.

కుంభం: ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంది. స్వయం ఉపాధి వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

మీనం: మంచి అవకాశలు వస్తాయి. భార్యాపిల్లలతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల్లో పురోగతికి అవకాశముంటుంది.

Related posts