telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“శివశంకరి” అంటూ అదరగొట్టిన బాలయ్య

NBK

నందమూరి బాలకృష్ణ పాడిన “శివశంకరి” పాటను తాజాగా విడుదల చేశారు. ఎన్టీఆర్ సినిమా “జగదేకవీరుని కథ” సినిమాలోని “శివశంకరి” అనే సాంగ్ ను అప్పట్లో ఘంటసాల పాడారు. ఈ పాట అప్పట్లో ఓ రికార్డ్ ను సాధించింది. ఈ పాటను పాడటం అంటే మాములు విషయం కాదు. సంగీతంపై పట్టు ఉండాలి. గాత్రశుద్ధి ఉండాలి. మహామహులే ఈ పాటలను పాడేందుకు కొంత ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనే స్వయంగా పాడిన పాటను ఎన్బీకె ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది. బాలకృష్ణ ఈ పాటను పాడేందుకు పూనుకోవడం సాసహం అనే చెప్పాలి. బాలయ్య విజయవంతంగా పాడాడు. ఈ సాంగ్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Related posts