telugu navyamedia
సినిమా వార్తలు

“కొబ్బరి మట్ట” ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్ గా కలెక్షన్ కింగ్

Kobbari-Matta

“హృదయ కాలేయం”, “సింగం 123” తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు “కొబ్బరి మ‌ట్ట” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు. బ‌ర్నింగ్ స్టార్ గా అభిమానుల‌చే పిల‌వ‌బడుచున్న సంపూ 2015లో “కొబ్బ‌రి మ‌ట్ట” అనే చిత్రం మొద‌లు పెట్టాడు. ఈ చిత్రం ఎట్ట‌కేల‌కి ఆగ‌స్ట్ 10న విడుద‌ల‌య్యేందుకు సిద్ద‌మైంది. ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది. ఈ క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు. ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు విచ్చేస్తున్నారు. “నాలాంటి చిన్న నటుడు అడగ్గానే మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేస్తున్న మా రియల్ పెదరాయుడుగారికి నా వందనాలు” అంటూ సంపూర్ణేశ్ బాబు ట్వీట్ చేశారు. “కొబ్బరిమట్ట” చిత్రంలో సంపూర్ణేశ్ పెదరాయుడు పాత్రలో కనిపిస్తున్నారు.

Related posts