telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్‌..!

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అవికా గోర్. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో అవికా గోర్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవల ‘రాజుగారి గది 3’లో హీరోయిన్‌గా నటించింది. చాలా గ్యాప్‌ తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె బరువు తగ్గి బాగా స్లిమ్‌గా తయారైంది. ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం ఈ భామ ఆమె కాదిల్‌ అనే ప్రైవేట్‌ సాంగ్‌లో నటుడు ఆదిల్‌ సరసన యాక్టింగ్‌ చేయనుంది. ఈ క్రమంలో వీరిద్దరూ చర్చిలో పెళ్లాడుతున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అవి కాస్త వైరల్‌ అయ్యాయి. వాళ్లిద్దరూ కలిసి నటిస్తున్న కాదిల్‌ పాటలోని వెడ్డింగ్‌ ఫోటోను అవికా లవ్‌ సింబల్‌ తో షేర్‌ చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యారు. 

Related posts