అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్న ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ టీమ్‌కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు తెలిపారు. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ వెబ్ సిరీస్‌గా అవార్డును అందుకుంది. ఈ పోటీలో జర్మనీ చారిటీ2 సిజన్ 2, యూకే క్రిమినల్ యూకే అండ్ అర్జెంటీనా ది బ్రాంజ్ గార్డెన్ సీజన్2లు పాల్గొన్నాయి. వాటిని వెనక్కు నెట్టి ఢిల్లీ క్రైమ్ అవార్డును అందుకోవడం గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఈ అవార్డు ఫంక్షన్ కరోనా కారణంగా వర్చువల్‌గా నిర్వహించారు. అయితే ఈ వెబ్ సిరీస్ రిచీ మెహతా దర్శకత్వంతో తెరకెక్కుతోంది. ఇందులో డిప్యూటీ కమీషనర్‌గా షఫాలీ ఫా కనిపించారు. ఈ సిరీస్ ఓ గ్యాంగ్‌రేప్ కేసు విచారణా నేపథ్యంలో తెరకెక్కింది. నిందిదుతులను పోలీసులు ఎలాపట్టుకున్నరన్నది కథ. ఈ వెబ్ సిరీస్ 2019లో విడుదలైంది. అయితే ఎట్టకేలకు అంతర్జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది. దీనిపై టాలీవుడ్ స్టార్ హీరో మమేష్ స్పందించారు. ఢిల్లీ క్రైమ్ టీమ్‌ను ప్రశంసించారు. ట్విట్టర్ వేదికగా మహేష్ ఢిల్లీ క్రైమ్‌ను ప్రశంసించాడు. ఈ సిరీస్ ఒక మాస్టర్ పీస్ అనీ, ఈ షో అవార్డుకు అర్హత కలిగిన సిరీస్‌అని చెప్పాడు. ఎమ్మీ అవార్డును అందుకోవడం భారీ విజయం అని పొగిడారు. ఈ సిరీస్ కేవలం 7ఎపిసోడ్స్‌కే పెద్దపెద్ద సంస్థలు ఈ సిరీస్‌కు 8.5 రేటింగ్ ఇచ్చారు.
previous post
ఆనాడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం.. ఈనాడు మోదీకి పాదాభివందనం!