telugu navyamedia
వార్తలు

LPG గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్‌న్యూస్‌..

మీరు గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ వాడే వారికి ఊరట కలుగనుంది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.

కొత్త రూల్స్ ప్రకారం.. మీకు నచ్చిన గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్‌కు మీరు మారవచ్చు. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంత మంది సిలిండర్ బుక్ చేసి చాలా రోజులు అయినా కూడా సిలిండర్ ఇంటికి రాదు. ఇలాంటి వారు ఇకపై ఇబ్బంది పడాల్సిన పని లేదు. వారి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌ను మార్చుకోవచ్చు. వేరే డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందే వెసులుబాటు ఉంటుంది. ఇలా నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

LPG Gas Cylinder Price Hike Updates: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా  ధరలు ఇలా! | News in Telugu

ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ పొందవచ్చని తెలిపింది. మీ డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకొని గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా సులభంగా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

Related posts