telugu navyamedia
రాజకీయ వార్తలు

శీతకాలం పోతే పెట్రోల్‌ ధరలు తగ్గుతాయి : కేంద్ర మంత్రి

petrol bottle

ఈ శీతకాలం తర్వాత పెట్రోల్‌ డిమాండ్‌ తగ్గి ధరలు దిగివస్తాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. ఆ ప్రభావమే దేశీయ మార్కెట్లపై పడిందన్నారు. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయన్న ఆయన.. ముడి చమురును సరఫరా చేసే దేశాలు తమ స్వలాభం కోసం ధరలను పెంచుతున్నాయని తెలిపారు. ఫలితంగా వీటి ప్రభావం చమురు ఆధారిత దేశంలోని వినియోగదారులపై పడుతోందని.. దీనిపై ఆయా దేశాలతో చర్చించినట్లు తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్.. ఇక, పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేరిస్తే ధరలు అదుపులో ఉంటాయని ఇటీవలే ప్రకటించారు ధర్మేంద్ర ప్రధాన్. కాగా, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సెంచరీ కూడా కొట్టేశాయి. పెట్రో ధరలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చూడాలి మరి ఆయన మాటలు నిజమవుతాయా… లేదా అనేది.

Related posts