telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ప్రపంచానికి చైనా ముప్పు..కెనడాలోని భారతీయుల నిరసన

canada china Indians

తూర్పు లఢక్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద భారత్‌, చైనా సైనికుల మధ్య ఇటీవీల జరిగిన భారీస్థాయిలో ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా పలు దేశాల్లోని భారతీయులు తమ నిరసన తెలియజేస్తున్నారు.

కెనడాలోని భారతీయులు వాంకోవర్‌లోని చైనా రాయబార కార్యాలయం ఎదుట నిరసన ర్యాలీ నిర్వహించి ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రపంచానికి చైనా ముప్పుగా మారిందని, బెదిరింపులకు పాల్పడుతున్నదని, భారతీయులను చంపుతున్నదంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. భారత్‌ సరిహద్దు నుంచి చైనా సైన్యం వెనక్కి తగ్గాలంటూ నినాదాలు చేశారు.

Related posts