ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనారోగ్యంతో కన్నుమూసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ మధ్యాహ్నం పనాజీ చేరుకున్న ప్రధాని మోదీ.. కాలా అకాడమీకి వెళ్లి పారికర్‌కు అంజలి ఘటించారు. అనంతరం పారికర్ కుటుంబసభ్యులను ఓదార్చారు. కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కూడా పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అంతకుముందు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పలువురు భాజపా నేతలు పారికర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.
గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం పారికర్ భౌతికకాయాన్ని కాలా అకాడమీకి తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు మిరామర్ బీచ్‌లో సైనిక లాంఛనాలతో పారికర్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
కేంద్ర నిధులను రాబట్టడంలో జగన్ విఫలం: యనమల