ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా కలెక్టరేట్ చౌక్‌లో ఏటీఎం చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. తాళ్లతో కట్టి కారులో ఏటీఎంను దుండగులు తీసుకెళ్లారు. శివారులో ఏటీఎంను దొంగలు వదిలివెళ్లారు. అక్కడితో ఆగకుండా ఆదిలాబాద్‌లోని దేవి చంద్‌చౌక్‌లో నగల దుకాణంలో దొంగతనానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో ఆ దుండగులు పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.
previous post
next post