telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దరిద్రమైన బూతులు… నేషనల్ టీవిలో ఇలాగా… యాంకర్ ఫైర్

Siddharth

సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 13లో సిద్ధార్థ్ శుక్లా తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తన షార్ట్ టెంపర్‌తో షోలో అసభ్యకరమైన పదజాలం వాడుతున్నాడు సిద్ధార్థ్. తనకు కోపం వచ్చినా బాధ వచ్చినా ఆపుకోలేనని, అందుకే అలా బూతులు మాట్లాడతానని తనని తాను సమర్ధించుకున్నాడు. దీనిపై ప్రముఖ హిందీ యాంకర్ అర్చనా పురాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. “ఇలా ఎవరు ప్రవర్తించినా నేను అస్సలు సహించలేను. నేను బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొన్నాను. బిగ్‌బాస్ హౌజ్‌లో దాదాపు వంద రోజులు ఉన్నాను. కానీ నేనుప్పుడూ ఇలాంటి బూతులు వినలేదు. ఎవ్వరి చేత తిట్టించుకోలేదు కూడా. ఎందుకంటే నాతో పాటు ఉన్న మిగతా కంటెస్టెంట్స్‌కి నేషనల్ టీవీలో ఎలా ప్రవర్తించాలో తెలుసు. బాయ్‌ఫ్రెండ్స్ కోపంతో దరిద్రమైన బూతులు మాట్లాడేస్తే ఎంతమంది ఆడపిల్లలు భరిస్తారో నాకైతే అర్థంకాదు. సారీ నన్ను మా ఇంట్లోవాళ్లు మాత్రం అలా పెంచలేదు” అని గట్టిగా క్లాస్ పీకింది. సిద్ధార్థ్‌పై ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిని నేషనల్ టీవీ షోలలో ఎందుకు తీసుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. సిద్దార్థ్ శుక్లా.. ఇతని గురించి తెలీని వారు ఎవరూ ఉండరు. ‘బాలికా వధు’ సీరియల్‌లో ఇతను కీలక పాత్ర పోషించాడు. ఈ సీరియల్ తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరుతో ప్రసారమైంది. ఈ సీరియల్‌తో సిద్ధార్థ్‌కు బాగా పేరు వచ్చింది కానీ అవకాశాలు లేకుండా పోయాయి.

Related posts