telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పాక్ భయం తెలుస్తూనే ఉంది.. భారత్ ఇక సహనం వహించదు.. : సుష్మా

sushma on pakistan pm

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉగ్రవాదం, చర్చలు రెండూ కలసి ముందుకు సాగవని అన్నారు. ఉద్రిక్తతలను నివారించడానికి భారత్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, ఇదే సమయంలో పాకిస్థాన్ నుంచి సరైన చర్యలను భారత్ ఆశిస్తోందని చెప్పారు. పుల్వామా దాడుల తర్వాత భారత్ మరింత తీవ్రంగా స్పందిస్తుందని పాకిస్థాన్ ఆందోళన చెందుతోందని సుష్మ అన్నారు. పుల్వామా దాడులను ఖండిస్తూ పలువురు విదేశాంగ మంత్రులు తనకు ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఇదే సమయంలో పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా చూడాలని కోరారని సుష్మ చెప్పారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా భారత్ అన్ని చర్యలు తీసుకుంటుందని తాను వారికి చెప్పానని తెలిపారు.

ఇదే సమయంలో, పుల్వామా తరహా ఘటన మరోసారి చోటుచేసుకుంటే… తాము చూస్తూ ఊరుకోబోమని చెప్పానని అన్నారు. ఉగ్రవాదం లేని వాతావరణం కోసం పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చాలా మానవత్వంతో వ్యవహరిస్తున్నారని కొందరు అంటున్నారని… జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను భారత్ అప్పగించి ఇమ్రాన్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. అప్పుడే ఆయనలో ఎంత మానవత్వం ఉందో అర్థమవుతుందని చెప్పారు.

Related posts