telugu navyamedia
సినిమా వార్తలు

“మజిలీ” సాంగ్ : యేడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారే లేదే…

majili movie on april 5th

మజిలీ చిత్రం నుండి మూడో పాటను యూనిట్ విడుదల చేసింది. నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంక కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం మజిలీ. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే టీజ‌ర్‌తో పాటు మూడు పాటలు విడుద‌ల చేసిన చిత్రబృందం తాజాగా “యేడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారే లేదే…” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుద‌ల చేశారు. గోపిసుందర్ సంగీతం, శివ నిర్వాణ సాహిత్యం, కాలభైరవ – నిఖిత గాంధీ ఆలాపన బాగున్నాయి.

మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత, నాగచైతన్య పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో “చైతూ గురించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు .. అలాగే నా గురించి చైతూ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. అలా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది” అని తెలిపింది సమంత. ఇక తనకెదురైన ప్రశ్నకి చైతూ సమాధానమిస్తూ… “ఎవరికైనా పెళ్లి అయిన ఏడాది వరకే హ్యాపీగా వుంటుంది… ఆ తరువాత అంతా బోరింగే” అంటూ సమంతను ఉండికించే ప్రయత్నం చేశారు. మరో ప్రశ్నకి సమాధానంగా “‘నాకు కార్లన్నా… అమ్మాయిలన్నా చాలా ఇష్టం” అని చై అనగా, “అలా అంటే ముఖంపై పంచ్ ఇస్తాను” అంటూ సమంత చిరు కోపాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దివ్యాంశ కౌశిక్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఇటు యూత్, అటు కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Related posts