telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూడేళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Fathima-Sana-Shaik

బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టింది. లైంగిక వేధింపులు అనేవి అన్ని చోట్లా కామన్ అయిపోయాయి. నేను మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే లైంగిక వేదింపులను ఎదుర్కొన్నాను. మహిళలు వాటిని చెప్పుకోలేక పోయారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. చదువుకోవడం వల్ల లైంగిక వేదింపులకు సంబంధించి మహిళలకు అవగాహన వస్తుంది. అందుకే వారంతా కూడా ఇప్పుడు బయటకు చెప్పుకుంటున్నారు అని పేర్కొంది ఫాతిమా. బాల నటిగా కెరియర్ ప్రారంభించినప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడానికి చాలా కష్టాలు పడాల్సొచ్చిందని, అవకాశలకోసం ఎక్కడికివెళ్ళిన అవమానాలు ఎదురయ్యేవని, చాలా మంది కమిట్మెంట్ అడిగేవారని తెలిపింది. ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఎలానో హీరోయిన్ అవ్వాలంటే కమిట్మెంట్ అలా అంటూ చాలామంది మాట్లాడేవారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాలో అమీర్ కూతురుగా, రెజ్లర్ గీతాసింగ్ పొగాత్ పాత్రలో నటించి మెప్పించింది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.

Related posts