telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీ ఆఫర్ ను వదులుకుని సంక్రాంతి బరిలో “రంగ్ దే”

Rangde

యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాయితీ ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ మూలంగా థియేటర్లు మూతబడడంతో, పూర్తయిన సినిమాలు కూడా కొన్ని విడుదల కాకుండా ఆగిపోయాయి. ఇలాంటి చిత్రాల నిర్మాతలకు ఓటీటీ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పైగా ఓటీటీ ప్లేయర్స్ మంచి రేటును కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీలో విడుదల కాగా.. హీరో నాని నటించిన ‘వి'” సినిమా కూడా ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. తాజాగా నితిన్ “రంగ్ దే” చిత్రానికి ప్రముఖ ఓటిటి సంస్థ నుండి దాదాపు రూ. 35 కోట్ల ఆఫర్ వచ్చిందట. అయితే చిత్ర యూనిట్ మాత్రం రూ.40 కోట్లు డిమాండ్ చేశారట. అయితే 40 కోట్ల ఇవ్వడానికి ఓటీటీ సంస్థ నో చెప్పడంతో సినిమాను సంక్రాంతి బరిలో థియేటర్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట చిత్రయూనిట్.

Related posts