కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో WHO జనరల్ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రయెసుస్ ఇటీవల ఓ కొత్త ఛాలెంజ్‌ని తీసుకొచ్చారు. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన వారు చేతులని శుభ్రంగా కడుక్కోవడంతో పాటు మరో ముగ్గురు లేదా నలుగురికి ఛాలెంజ్ విసరాలన్నారు. అయితే టెడ్రోస్ ముందుగా ప్రియాంక చోప్రా, ఆర్నాల్డ్, మోడల్ క్రిస్టి టర్లింగ్టంన్‌లని నామినేట్ చేశారు. అయితే ఈ ఛాలెంజ్‌ని స్వీకరించినా ప్రియాంక చోప్రా.. హ్యాండ్ వ్యాష్ ఛాలెంజ్‌లో పాల్గొంది. సేఫ్ హ్యాండ్స్ సవాల్ని అంగీకరిస్తున్నానంటూ పాట పాడుతూ… ప్రియాంక ఈ ఛాలెంజ్‌ను మరో నలుగురికి సవాల్ విసిరారు. సరైన పద్ధతిలో మనం చేతుల్ని కడిగితే… ప్రాణాలు కాపాడుకోవచ్చు. కరోనా నుంచి ముందు మనల్ని మనం రక్షించుకోవాలంటే… చేతుల్ని సరిగ్గా కడుక్కోవాలని ప్రియాంక పేర్కొంది. భర్త నిక్ జోనాస్, చెల్లెలు పరిణితీ చోప్రా, అమితాబ్ బచ్చన్, కేట్ బాస్‌వర్త్, మైండీ కలింగ్‌లకి ఈ ఛాలెంజ్‌లు విసిరింది. సేఫ్ హ్యాండ్స్ సవాలుని స్వీకరించిన ప్రయాంక చోప్రా పాట పాడుతూ చేతులని శుభ్రపరచుకుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, దీనిపై డబ్ల్యూహెచ్‌వో జనరల్ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ప్రియాంక వీడియోని షేర్ చేస్తూ మీరు ఎక్కడ ఉన్నా చేతులని శుభ్రంగా కడుక్కోండి. మీరు పాడిన హ్యాండ్ వాషింగ్ సాంగ్ చాలా నచ్చింది. కరోనా తరిమికొట్టే ప్రయత్నంలో మీరు మాతో భాగస్వామ్యులు కావడం సంతోషంగా ఉందని టెడ్రోస్ స్పష్టం చేశారు.
I accept the #SafeHands challenge 🧼@DrTedros. One of the main takeaways from our IG live yesterday was the importance of washing your hands properly. It’s a simple action that can help save lives. I nominate @katebosworth, @mindykaling, @nickjonas, @ParineetiChopra & @SrBachchan pic.twitter.com/XFSuosBTRA
— PRIYANKA (@priyankachopra) March 25, 2020