telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అధికబరువు తగ్గాలా.. ? .. ఇదే పెద్ద ఆయుధం..నెలలోనే.. !

Plank Exercise is best for weight and belly loss

ఏది ఎంత తింటున్నామో తెలియని స్థితిలో ఆహారం కడుపులో వేస్తుండటం ఇప్పటి కాలంలో సహజంగా జరిగిపోతుంది. దీనితో చాలా మంది తెలియకుండానే అధిక బ‌రువు, పొట్ట‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎంత ప్ర‌య‌త్నించినా ఈ సమస్యలు దూరం కావటం లేదు. ఎన్నో ప్రయత్నించి ఉంటారు కదా.. అయితే కింద తెలిపినట్టుగా ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ చేసి చూడండి. చాలా త్వ‌రగా పొట్ట క‌రిగిపోతుంది. మ‌రి ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ ఎలా చేయాలో, ఎన్ని రోజులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

నేల‌పై బోర్లా ప‌డుకుని మోచేతుల‌ను, కాలి వేళ్ల‌ను ఆధారంగా చేసుకుని శ‌రీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. దీనితో పొట్ట‌, ఛాతీ కండ‌రాలు, భుజాల‌పై అధికంగా ఒత్తిడి ప‌డుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ వ్యాయామాన్నే ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ (Plank Exercise) అంటారు. ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ 4 నిమిషాల పాటు చేస్తే చాలు. శ‌రీరంలో అధికంగా ఉన్న బ‌రువు, కొవ్వు క‌రిగిపోతుంది. అంతేకాదు.. పొట్ట కూడా తొంద‌ర‌గా త‌గ్గుతుంది.

పైన చెప్పిన ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ కింద సూచించిన విధంగా చేస్తే కేవ‌లం 28 రోజుల్లోనే పొట్ట త‌గ్గుతుంది. అయితే ఒకే రోజు ఎక్కువ సేపు చేసి, సమస్యలు తెచ్చుకోకుండా, మొదటి రోజు 20 సెకండ్లతో ప్రారంభించండి. అనంతరం మీకు సుఖంగా ఉన్నంతవరకు రెండు రోజులకు లేదా మూడు రోజులకు ఒక 20 సెకండ్లు పెంచుకుంటూ సాధన చేయండి. ఈ ప్ర‌కారం పై ఎక్స‌ర్‌సైజ్ ను రోజూ(28) చేస్తే ఫ‌లితం ఉంటుంది.

ఇలా ఆరంభంలో కొంత స‌మ‌యంతో ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్‌ను మొదలు పెట్టి మ‌ధ్య‌లో విశ్రాంతి ఇస్తూ.. టైం పెంచుతూ ఈ వ్యాయామం చేస్తే త్వ‌ర‌గా పొట్ట త‌గ్గుతుంది.

Related posts