telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ భగీరథ ప్రయత్నాన్ని అభినందించాలి

bhageeradha

భగీరథ ఈ మధ్య వెలువరించిన “భారతమెరికా” పుస్తకం తెలుగు సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. “భారతమెరికా” ఓ విలక్షణ ప్రయత్నం. భారత దేశం, ముఖ్యంగా దక్షిణ భారత దేశం, అలాగే తెలుగు సాహిత్య పరిణామం గురించి రాయడం అనేది ఓ అరుదైన విషయం. ఓ మంచి ప్రయాగం కూడా !

భగీరథ రచించిన 14వ పుస్తకం “భారతమెరికా: 2014లో వంగూరి చిట్టెన్ రాజు గారి ఆహ్వానంతో అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన సాహిత్య సభలకు ప్రత్యేక అతిధిగా వెళ్ళడు . అక్టోబర్ 25, 26 రెండు రోజులపాటు జరిగిన సభల్లో భగీరథ మధ్య యుగాలనాటి దక్షిణ భారత దేశం గురించి ప్రసంగించి అందరినీ ఆశర్యచకితులను చేశాడు. భగీరథను సినిమా జర్నలిస్టు గానే చూస్తారు. కానీ ఆయన కవిగా, రచయితగా ఎంత ఎదిగాడో ఆయన రచించిన “అక్షరాంజలి”, “భారతమెరికా” చదివిన ఎవరికైనా అర్ధమవుతుంది.

భగీరథ తన అమెరికా పర్యటన తో దేశ చరిత్ర, తెలుగు సాహిత్యాన్ని కలిపి రాయడం అనేది ఈ పుస్తకం ప్రత్యేకత.

1980లో భగీరథ తన మొదటి కవితా సంపుటి “మానవత”తో అందరినీ ఆకట్టుకున్నాడు. కారణం మానవత కవితా సంపుటికి మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) ముందుమాట వ్రాసి స్వయంగా ఆవిష్కరించారు. ఆ రోజున భగీరథ గురించి శ్రీశ్రీ ఏమన్నాడంటే… “ఈ భగీరథ ప్రయత్నాన్ని ఎవరైనా అభినందిస్తారు. అందరి కన్నా ముందుగా దీన్ని మెచ్చుకొనే అవకాశం నాకు లభించినందుకు ఆనందిస్తున్నాను. ఆనాడు భగీరధుడు ఎక్కడో వున్న గంగను భూలోకానికి తీసుకు వచ్చాడు. మన మధ్యనే మాటు మణిగి వున్న మానవత్వాన్ని మన ముందు ప్రదర్శిస్తున్నాడు ఈనాటి మన భగీరథుడు. మన భగీరథ ప్రశంసిస్తున్న మానవత్వానికి నేను కూడా స్వాగతం చెబుతున్నాను. అతని సామాజిక స్పృహకు నేను కూడా స్పందిస్తున్నాను.
మనిషిగా పుట్టి
మనిషిగా ఆలోచించేవారికి
మాత్రమే నేనర్ధమవుతాను
అంటున్న ఇతణ్ణి నేను బాగా అర్థం చేసుకుంటున్నాను”

నాలుగు దశాబ్దాల క్రితం మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలవి. వాటిని “భారతమెరికా”తో నిజం చేశాడని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ గ్రంథం గురించి చాలామంది అనూహ్యమైన అభిప్రాయాలాలను వెలిబుచ్చారు. భారతమెరికా చదవడం మొదలు పెడితే ఎక్కడా ఆపాలనిపించదు. మనకు తెలియని ఎన్నో విషయాలను భగీరథ సరళమైన శైలితో వివరించాడు. ఈ పుస్తకం నిస్సందేహంగా చరిత్రను అధ్యయనం చేసే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. భారతమెరికా లాంటి పుస్తకాన్ని అందించిన భగీరధను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

                                                                                                 – శ్రీమతి వీరగంధం విజయలక్ష్మి  

                                                                                                                                                    veeragandham

భారతమెరికా పుస్తకాలు లభించే చోటు :
నవోదయ బుక్ హౌస్ , హైదరాబాద్ .
సెల్ నెంబర్ : 92474 71361
అచ్చంగా తెలుగు, హైదరాబాద్
సెల్ నెంబర్ : 85588 99478.

Related posts