telugu navyamedia
సినిమా వార్తలు

సురేష్ ప్రొడక్షన్స్ లో “దబాంగ్-3” తెలుగు

Salman-KHan

సల్మాన్ ఖాన్ కు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన డబ్బింగ్ సినిమాలు తెలుగులోనూ అప్పుడప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో ఆయన తాజా చిత్రం సైతం తెలుగులో డబ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమాలు బాలీవుడ్‌లోనూ మంచి విజయాలను సాధిస్తున్న ఈ తరుణంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ దక్షిణాది మార్కెట్‌ లో తన సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా హిందీ తర్వాత అతి పెద్ద మార్కెట్ అయిన తెలుగు సహా తమిళ, కన్నడ భాషల్లోనూ తన సినిమా “దబాంగ్-3″ని విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సల్మాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దబాంగ్ 3’. 2010లో విడుదలైన “దబాంగ్” ఫ్రాంచైజీలో మూడో పార్ట్ ఇది. ‘వాంటెడ్’ తర్వాత సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ నటిస్తోన్న ఈ చిత్రం తొలిసారి హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదలవుతుందట. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను విడుదల చేస్తుందని సమాచారం. సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

Related posts