telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డిస్కోరాజా : పాయల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

Discko

విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం “డిస్కో రాజా”. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమ‌వుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, సునీల్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు నటించారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ అవుట్‌పుట్ కోసం “డిస్కోరాజా” విడుదల తేదీని డిసెంబర్ 20 నుంచి జనవరి 24కి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి, దర్శకుడు వి ఐ ఆనంద్ తెలిపారు. కాగా ఈరోజు పాయ‌ల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర బృందం ఆమె ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో రెండు జ‌డ‌లు వేసుకొని చేతిలో గ‌న్ ప‌ట్టుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తుంది. ఈ పోస్ట‌ర్ పాయ‌ల్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Related posts