ఏపీలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 15.01.21 తేదీ నాటికి 4 కోట్ల 4 లక్షల 41 వేల 378 ఓటర్లు ఉన్నట్టు జాబితా విడుదల చేసారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్. ఇందులో మహిళ ఓటర్ల సంఖ్య 2 కోట్ల 4 లక్షల 71 వేల 506 కాగా… పురుష ఓటర్ల సంఖ్య 1 కోటి 99 లక్షల 66 వేల 737 గా ఉంది. సర్వీసు ఓటర్లు 66 వేల 844 ఉండగా… థర్డ్ జెండర్ ఓటర్లు 4,135 గా ఉన్నట్లు తెలిపారు ఈసీ. కొత్తగా 4 లక్షల 25 వేల 860 మంది ఓటర్లు 2021 జనవరి నాటికి పెరిగారని పేర్కొన్నారు ఈసీ. కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఏపీలో మరింత హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఎన్నికలు ప్రభుత్వం వద్దంది..! ఉద్యోగులు మా వల్ల కాదన్నారు. అయినప్పటికీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసిన ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ ఎస్‌ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ను కోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది.
previous post